మహారాష్ట్రలోని థానేలో రోడ్డుపై ఇద్దరు కారు డ్రైవర్ల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర బీభత్సానికి దారితీసింది. ఆగ్రహానికి గురైన బ్లాక్ కలర్ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్న వారిపై కారుతో దాడికి పాల్పడ్డాడు. ఏకంగా మనుషులనే చీమల్లా కారుతో తొక్కించాడు. ఈ ఘటనలో కార్ల కింద పడి మొత్తం ఏడుగురు గాయపడ్డారు. ఒక వ్యక్తి రోడ్డుపై సడి గాయాలతో కొట్టుమిట్టాడుతుండటం వీడియోలో కనిపించింది.