విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ (వీడియో)

81చూసినవారు
ప్రైవేటు విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొచ్చి నుంచి చెన్నై వస్తున్న విమానంలో టేకాఫ్ అవుతుండగా… ఓ విదేశీ ప్రయాణికుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే సదరు ప్రయాణికుడు విమానంలో బాంబు పెడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతోనే ఘర్షణ మొదలైనట్లు సమాచారం. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాదాపు 3 గంటలపాటు తనిఖీలు నిర్వహించగా.. బాంబులు లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్