అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

73చూసినవారు
అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
కర్ణాటకలో, గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైద్యశాఖ అధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై ఆయన అధికారులను అడిగారు. అయితే ఏపీలో ఎలాంటి అనుమానిత కేసులు నమోదు కాలేదని అధికారులు సీఎంకు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్