కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల పురోగతి గురించి ఆయనతో సీఎం చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సర్వే చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య హాజరయ్యారు.