దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో అర్బన్ మొబిలిటీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మౌలిక సదుపాయాలు, సమగ్రత, స్థిరత్వంపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ భవిష్యత్తు నగరాన్ని అర్బన్ మొబిలిటీతో ప్రపంచంలోనే అత్యుత్తంగా మార్చాలనుకుంటున్నట్లు ఆయన వివరించారు. నగర ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను తగ్గించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు.