సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార ప్రొటోకాల్ దర్శనాలు రేపు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్నాయి.