సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 1:30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. అక్కడ టెక్స్‌టైల్స్ పార్క్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి సందర్శన, మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7:20 గంటలకు HYD చేరుకుంటారు.