AP: రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం

57చూసినవారు
AP: రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. దీని వల్ల 2,400 మందికి ఉపాధి కలగనుంది. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్ 2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు.

సంబంధిత పోస్ట్