రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే కాఫీని అసలు రోజుకు ఎన్ని కప్పుల వరకు తాగితే మంచిది? అన్న విషయానికి వస్తే.. వైద్యులు చెబుతున్న ప్రకారం రోజుకు 2- 3 కప్పుల వరకు కాఫీని సేవించవచ్చు. అంతకు మించితే మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.