ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్

62చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ అన్నారు. ఓ ఇంటర్వ్యూ లో సీఎం మాట్లాడుతూ.. 'నాకు నమ్మకం ఉన్న దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా. రుణమాఫీ చేస్తా. వచ్చిన తెల్లారే ప్రభుత్వం నుంచి దిగిపో అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుంది. అధికారులు ఇప్పటివరకు నాకు నివేదిక ఇవ్వలేదు. నివేదిక వచ్చే వరకు నేను కూడా దీనిపై మాట్లాడటం సరికాదు. నివేదిక వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు స్పష్టంగా చెబుతా' అని అన్నారు.

సంబంధిత పోస్ట్