సీఎం రేవంత్ రెడ్డి జనవరి 16 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. సింగపూర్ పర్యటన అనంతరం జనవరి 20 నుంచి 22 వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.