వరల్డ్ కప్‌తో కోచ్ ద్రవిడ్ సంబరాలు (వీడియో)

65చూసినవారు
రాహుల్ ద్రవిడ్ సుదీర్ఘ కాలం భారత క్రికెటర్‌గా కొనసాగారు. తన కెరీర్‌లో ఆయన ఆటగాడిగా వరల్డ్ కప్ అందుకోలేకపోయారు. అయితే కోచ్‌గా మాత్రం ఆయన టీ20 వరల్డ్ కప్ సాధించారు. సౌతాఫ్రికాపై ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత కప్‌ను ద్రవిడ్‌కు కోహ్లి అందించారు. దీంతో కప్ పట్టుకుని ద్రవిడ్ భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలో సంబరాలు చేసుకున్నారు. ఇక భారత్ కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగిసింది.

సంబంధిత పోస్ట్