హైదరాబాద్​లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ.. 15 వేల మందికి ఉద్యోగాలు

584చూసినవారు
హైదరాబాద్​లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ.. 15 వేల మందికి ఉద్యోగాలు
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్​లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్​లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్​లో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ బృందంతో సమావేశమైంది. హైదరాబాద్​లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్