హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్, మంత్రులపై ఓ స్టాండప్ కమెడియన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. CM రేవంత్, కరెంట్ కోతలు, సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అతడు సెటైర్లు వేశారు. APలో అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వాన్ని మారిస్తే తెలంగాణ ప్రజలు డెవలప్మెంట్ ఎక్కువై సర్కార్ ను మార్చారని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కాంగ్రెస్ అభిమానులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.