కాంగ్రెస్‌కు రాహుల్‌ వయసు కన్నా తక్కువ సీట్లే: మోదీ

51చూసినవారు
కాంగ్రెస్‌కు రాహుల్‌ వయసు కన్నా తక్కువ సీట్లే: మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ (53) వయసు కన్నా తక్కువ స్థానాలే వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. అయితే ఆయన రాహుల్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ‘షెహజాదా’ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారన్నారు. మోదీ ఉన్నంత వరకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ఎవరూ రద్దు చేయలేరన్నారు.

సంబంధిత పోస్ట్