భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఒలింపిక్ విజేత మనూ భాకర్ తెలిపారు. పతకం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ’'ఫైనల్ రౌండ్స్ కు ముందు కూడా నేను భగవద్గీత చదివా. నా ఫోకస్ జరగాల్సిన దానిపైనే. ఫలితం గురించి ఆలోచించలేదు. భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది' అని ఆమె పేర్కొన్నారు. పతకం సాధించడం గొప్ప అనుభూతి. నా వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. కోచ్ జస్పాల్ రాణా, స్పాన్సర్‌లకు ధన్యవాదాలు’’ అని తెలిపింది.