యూపీలోని వారణాసిలో ఆటోను ఢీకొట్టినందుకు కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్న ఓ పోలీసు అధికారిపై పలువురు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను రాజాతలాబ్ పోలీస్ స్టేషన్ SHO అజిత్ వర్మ అని అతడు చెప్పాడు. కానీ కోపోద్రిక్తులైన స్థానికులు వినిపించుకోకుండా అతడిపై దాడి చేశారు. ఈ మేరకు మరో కానిస్టేబుల్ సర్దిచెప్పినా వారు వినలేదు. చివరికి సమీపంలోని పీఎస్ నుంచి పోలీసులు వచ్చి సర్దిచెప్పాల్సి వచ్చింది.