యువతిని దారుణంగా కొట్టిన జంట (వీడియో)

58చూసినవారు
రోడ్డు మధ్యలో ఓ యువతిపై ఓ జంట దారుణంగా దాడి చేసి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని వార్దాలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ప్రకారం.. కారులో వెళుతున్న ఓ పురుషుడు, మరో మహిళ తొలుత బైక్‌పై వెళ్తున్న ఓ యువతితో వాదించడం కనిపించింది. యువతి వీడియో తీయడానికి ప్రయత్నించగా, పురుషుడు ఆమెపై దాడి చేశాడు. తర్వాత మహిళ కూడా యువతిని కొట్టింది. దీంతో యువతికి తీవ్ర రక్తస్రావం అయింది.

సంబంధిత పోస్ట్