భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జరిగే చెన్నై చెపాక్ పిచ్ సాధారణంగానే స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు జరగబోయే మ్యాచ్‌లో పిచ్ బ్యాటర్లకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పిచ్‌పై తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.