మహారాష్ట్రలో బస్సు ఛార్జీల పెంపు

55చూసినవారు
మహారాష్ట్రలో బస్సు ఛార్జీల పెంపు
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. హకీమ్ కమిటీ నిర్ణయించిన ఫార్ములా ప్రకారం బస్సు ఛార్జీల పెంపుదలకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరపై 14.95శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు ఫలితంగా MSRTC బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్