AP: విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చిన్నాన్నను చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని అన్నారు. రాజీనామా పేరుతో నిన్న రాత్రి నుంచి విజయసాయిరెడ్డి చేస్తున్న ఎత్తులు, నక్కజిత్తులు చూస్తున్నామని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై కక్ష కట్టి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అని మండిపడ్డారు.