ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ప్రేమ మైకంలో పడి.. ఏకంగా క్లాస్ రూంలోనే ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఈ వీడియోలో అబ్బాయి సిగ్గుపడుతుండగా అమ్మాయి ముద్దులు పెడుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.