కూలిన విమానం.. షాకింగ్ వీడియో

1584చూసినవారు
రష్యాలోని ఇవానోవోలో మంగళవారం ఐఎల్-76 కార్గో విమానం కూలిపోయింది. అది రష్యా సైనిక రవాణా విమానంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు సజీవంగా ఉన్నారా లేక చనిపోయారా అనే విషయంపై స్పష్టత లేదు. విమానం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని వారాల క్రితమే ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న విమానం కూలిపోయి, భారీగా ప్రాణనష్టం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్