ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం సోమవారం అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. అలాగే, రూ.2,498 కోట్లతో రహదారుల పనులకు అథారిటీ అనుమతి ఇచ్చింది. సీఆర్‌డీఏ పరిధిలో రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి కూడా అనుమతి లభించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఈ భవనాలు నిర్మించనున్నారు.