క్రికెట్ మైదానంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న ఓ ప్లేయర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి మరణించాడు. ఈ దురదృష్టకర సంఘటన ఇవాళ మధ్యాహ్నం మహారాష్ట్రలోని జాల్నాలో చోటుచేసుకుంది. మృతి చెందిన ఆటగాడిని విజయ్ పటేల్ (35)గా గుర్తించారు. ముంబై యంగ్‌స్టార్ జట్టుకు ఆడేందుకు అతన్ని జల్నాకు తీసుకువచ్చారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.