ఉల్లి ఆకుల అడుగుభాగాన తామరపురుగులు చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలేర్పడతాయి. దీని నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ.లు లీగర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేయాలి. ఉల్లిలో ఆకుతినే పచ్చ పురుగు నివారణకు కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు మందును 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.