వేసవి కాలం మొదలైపోయింది. ఇప్పటికే ఎండలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వేసవి కాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో మటన్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే పిజ్జాలు, బర్గర్లు, బజ్జీలు, ఆయిల్‌లో వేంచిన ఆహారం శరీరాన్ని వేడెక్కిస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.