ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హీరో కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 12న జరగనున్నట్లు వెల్లడించారు. అలాగే అభిమానులు అందరూ జాగ్రత్తగా ఇంటికి చేరాలని సూచించారు.