తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో చదివే విద్యార్థినులతో నలుగురు టీచర్లు అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. క్లాసు రూమ్ లో, గేమ్స్ ఆడుతున్నపుడు సదరు టీచర్లు దగ్గరకొచ్చి వల్గర్ భాష వాడేవారని, బ్యాడ్ టచ్ చేసేవారని విద్యార్థినులు తెలిపారు. పేరెంట్స్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సదరు టీచర్స్ పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై శివకుమార్ చెప్పారు.