AP: సీఎం చంద్రబాబు కుప్పంలో నేడు పర్యటించారు. కుప్పం మండలం నడుమూరులో సంపూర్ణ సూర్యఘర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా 16 ఇళ్లకు ఉచిత సోలార్ పవర్ కనెక్షన్లు ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి ఉచిత సోలార్ పవర్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఈ నెల చివరికి గ్రామంలోని 100 ఇళ్లకు ఉచిత సోలార్ పవర్ కనెక్షన్లు ఇస్తామన్నారు.