ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ కీలక నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు అభిమానులు చనిపోతే.. మూడు రోజులైనా పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయం. పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వెయ్యకపోవడం కారణమంటూ రాజకీయం చేయడం తగునా? మానవత్వం మరిచి.. నిందలా?' అని రోజా ట్వీట్ చేశారు.