ఎర్ర, నల్లనేలలు పుదీనా సాగుకు అనుకూలం. చల్లని వాతావరణం సరిపడదు. ఈ పంటకు విత్తనాలు ఉండవు. కొమ్మలను ముక్కలుగా చేసి నాటాలి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల కొమ్మలు అవసరం. జపాన్ పుదీనా. కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. ఎకరాకు రూ.30-40 వేలు వరకు పెట్టుబడి అవుతుంది. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎనిమిది నెలల్లో 30-40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.