న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ అవడం బాధగా ఉందని అన్నాడు. ఈ సిరీస్‌లో ఘోర తప్పిదాలు చేశామని, న్యూజిలాండ్ మెరుగ్గా ఆడిందని పేర్కొన్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని తెలిపాడు. టెస్టు మ్యాచ్, టెస్టు సిరీస్ కోల్పోవడం అంత తేలికైన విషయం కాదని, దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు.