తీగజాతి కూరగాయల సాగు.. సస్యరక్షణ చర్యలు

61చూసినవారు
తీగజాతి కూరగాయల సాగు.. సస్యరక్షణ చర్యలు
తీగజాతి కూరగాయల సాగులో గుమ్మడి పెంకు పురుగు నివారణకు 2శాతం పాలిడాల్‌ పొడిని వారంలో రెండు సార్లు చల్లాలి. పొట్లాకు పురుగు మొక్కల పెరుగుదల, పూత దశల్లో ఆకులను ఎక్కువగా కొరికివేస్తాయి. నివారణకు క్లోరోపైరిఫాస్‌ 2 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా ఒక గ్రాము థయోడీకార్ప్‌ను లీటర్‌ నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి. బూజు తెగులు నివారణకు లీటర్‌ నీటికి మాంకోజబ్‌ 2.5 గ్రాములు లేదా తీవ్ర దశలో ఉంటే రెడోమిల్‌ ఎం.జడ్‌ ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్