డిసెంబర్ 26 నుంచి కర్ణాటకలోని బెల్గాంలో రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రేపు హైదరాబాద్ నుంచి బెల్గాంకు సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బయలుదేరనున్నారు. కర్ణాటకలోనే రెండు రోజుల పాటు కాంగ్రెస్ నేతలు బస చేయనున్నారు. కాగా, ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు.