సైబర్‌ దాడులు.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో భారత్‌

85చూసినవారు
సైబర్‌ దాడులు.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో భారత్‌
అంతర్జాతీయంగా ‘ఫిషింగ్‌’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్‌ తర్వాత భారత్ నిలిచింది. భారత దేశంపై జరిగిన సైబర్‌ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. గతేడాది కాలంగా అంతర్జాతీయ ఫిషింగ్‌ దాడులు 60% పెరిగాయని తెలిపింది. 2023 జనవరి-డిసెంబరులో కనిపించిన 200 కోట్ల బ్లాక్డ్‌ ఫిషింగ్‌ లావాదేవీల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్