బెంగళూరులో మరో సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ అరెస్టు పేరుతో కేటుగాళ్లు ఏకంగా రూ.12 కోట్లు కొట్టేశారు. కొందరు కేటుగాళ్లు బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నట్లు అతడిని బెదిరించారు. దీంతో సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భయపడి సుమారు రూ.12 కోట్లు బదిలీ చేశాడు. తర్వాత మోసాన్ని గమనించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.