మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండోర్‌లోని సాన్వర్ రోడ్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాస్టిక్, పుస్తా ఫ్యాక్టరీలో 'సోమవారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లక్షలాది విలువైన వస్తువులు కాలి బూడదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.