విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా సోమవారం భారత సాయుధ దళాలకు చెందిన సర్వీసెస్ టీంపై 74 బంతుల్లోనే 148 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటి బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ టీం 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో మహారాష్ట్ర టీం గైక్వాడ్ మెరుపు సెంచరీతో లక్ష్యాన్ని 20.2 ఓవర్లలోనే పూర్తి చేసింది.