ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను ఎంపీ సి.ఎం.రమేష్ వెల్లడించారు. పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో సంయుక్తంగా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు జనవరి 8న శంకుస్థాపనలు జరుగనున్నాయన్నారు. ఆయా శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని మోదీ రానున్నట్లు తెలిపారు.