భారీ వర్షాల నేపథ్యంలో ఇంటి నుంచే పని చేసుకోవాలని ఐటీ ఉద్యోగులకు సూచించిన సైబరాబాద్ పోలీసులు

77చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో ఇంటి నుంచే పని చేసుకోవాలని ఐటీ ఉద్యోగులకు సూచించిన సైబరాబాద్ పోలీసులు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని అన్ని ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. "ఉద్యోగుల భద్రత, శ్రేయస్సు చాలా ముఖ్యం. ఇంటి నుంచే పని చేయడానికి వారికి అనుమతి ఇస్తే ఈ వాతావరణంలో ప్రయాణాల్లో జరిగే ప్రమాదాలు తగ్గుతాయి" అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు కూడా ఇవాళ సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్