ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఐఎండీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇరాక్, బంగ్లాదేశ్ దేశాల్లో నెలకొన్న సైక్లోన్ల ఎఫెక్ట్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మార్చి 15 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.