2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్ చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే తమిళింగా వెట్రి కళగం పార్టీ పేరును ఆయన ప్రకటించారు. 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగే విధంగా విజయ్ ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.