బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని IMD తెలిపింది. దీని ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తాజా తుపానుకు ఖతర్ ‘దానా’ అని నామకరణం చేసింది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) రూపొందించిన ఉష్ణమండల తుపాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్ 'ఉదారత' అని అర్థం.