ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ కూతురు ఆస్తి కోసం కన్నవారిపైనే దాడికి తెగబడిన ఘటన ఆగ్రాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన సురేఖ కుమారి అనే యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆస్తిపై కన్నేసిన ఆమె రోజూ స్కూటీపై ఇటుకలు, రాళ్లు తీసుకొచ్చి తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై దాడులు చేస్తుంది. సీసీ ఫుటేజీలో దాడి దృశ్యాలు నమోదు కావడంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.