హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్ చేశాడు. ఆసిఫ్ నగర్‌సమీపంలోని మల్లేపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి హోండా సిటీ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్పగాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.