మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రేపు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఫడ్నవీస్ పేరిట జారీ చేసిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆహ్వాన పత్రికలో ఫడ్నవీస్ పేరు ‘దేవేంద్ర సరితా గంగధరరావు ఫడ్నవీస్’ అని ఉంది. తల్లీదండ్రుల పేరుతో ఆహ్వానపత్రిక రూపొందించడంతో వైరల్‌గా మారింది.