తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒక్క సంవత్సరకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. కేవలం 12 వేల ఉద్యోగాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. రేవంత్ గురించి రాహుల్‌కు తెలిసినా స్వాతిముత్యంలా యాక్టింగ్ చేస్తున్నాడు' అని మండిపడ్డారు.