తెలంగాణ ప్రభుత్వం.. దావోస్ సదస్సు ఖర్చుల కోసం రూ.12.30 కోట్లు మంజూరు చేసింది. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్లనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర బృందం దావోస్ వెళ్లనుంది. ఈ క్రమంలో ఐటీ శాఖ బడ్జెట్ నుంచి రూ.12.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రత్యేక CS జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.