భోజనం చేస్తూ గుండెపోటుతో మృతి (వీడియో)

55చూసినవారు
కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. యూపీలోని వారణాసిలో ఇదే తరహా షాకింగ్ ఘటన జరిగింది. రాకేష్ అవస్తీ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. ఆయన భోజనం చేసేందుకు హోటల్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతడికి ఛాతీలో నొప్పి వచ్చింది. ఈ క్రమంలో భోజనం చేస్తూనే ఆ వ్యక్తి కుప్పకూలి పడిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్